సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday 15 October 2023

సమృద్ధి ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం !


హారాష్ట్ర, ఛత్రపతి శంబాజీ నగర్ జిల్లాలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారిపై ముంబైకి 350 కి.మీ దూరంలో వైజాపుర్‌ ప్రాంతంలో అర్థరాత్రి 12:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. జరిగింది. ముందు వెళుతున్న ట్రక్కును వెనుక నుంచి బస్సు ఢీకొట్టడంతో 12 మంది చనిపోయారు. మరో 23 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఓ చిన్నారి, ఆరుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి అతి వేగం కారణమని పోలీసులు భావిస్తున్నారు. మినీ బస్సు డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీ కొట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతేడాది డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించారు. దీనిపై ఇప్పటివరకు సుమారు 900 పైగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కొద్దిరోజుల క్రితం ఛత్రపతి శంబాజీ నగర్‌ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. 'సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే రోడ్లు ఎలాంటి వంపులు లేకుండా తిన్నగా ఉంటాయి. అందుకే డ్రైవర్లకు నిద్రమత్తుగా అనిపించి ప్రమాదాలు జరుగుతున్నాయి. కారణం ఏదైనా సరే.. ఈ ప్రమాదాలను కట్టడి చేయాల్సి ఉంది' అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 

No comments:

Post a Comment