ముంబైలో అంతర్జాతీయ బేకరీ షాపు సిబ్బందిపై కాల్పులకు యత్నం !

Telugu Lo Computer
0


ముంబైలో అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌ సిబ్బందిపై కాల్పులకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. అయితే గన్‌ ఫైర్‌ కాకపోవడంతో అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో ప్రముఖ కాషిమిరా ప్రాంతంలోని అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. ముఖానికి హెల్మెట్‌ పెట్టుకున్న అతడు గన్‌ ఎక్కుపెట్టి అక్కడున్న సిబ్బందిపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. అయితే గన్‌ ఫెయిల్‌ కావడంతో ఫైర్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో ఉన్న అంతర్జాతీయ బేకరీ సంస్థ అవుట్‌లెట్‌ సిబ్బందిపై కాల్పులకు ఆ వ్యక్తి ఎందుకు ప్రయత్నించాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)