పిచ్చికి పరాకాష్ట !

Telugu Lo Computer
0

@skytattoos111 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన వీడియో చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ యువకుడు గర్ల్ ఫ్రెండ్ తన చేతిపై కొరికిన గుర్తును టాటూగా వేయించుకున్నాడు. 'Bite Tattoo' శీర్షికతో ఈ వీడియోను షేర్ చేశారు. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ చేయిపై కొరుకుతున్నట్లు వీడియో ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత ఆమె కెమెరావైపు చూసి నవ్వింది. టాటూ ఆర్టిస్ట్ మొదట పెన్‌తో ఆమె కొరికిన చోట గుర్తులు పెట్టుకున్నాడు. ఇక దానిపై పచ్చబొట్టు ముద్రించాడు. '16.9.23' 'పెరూ' అనే అక్షరాలు కూడా పచ్చబొట్టు మీద కనిపిస్తాయి. సెప్టెంబర్ 17 న పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. 17.7 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతోంది. అయితే చాలామంది దీనిపై మండిపడ్డారు 'ఇన్‌స్టాగ్రామ్‌లో డిస్‌లైక్ ఆప్షన్ ఎందుకు లేదు?' అని ప్రశ్నించారు. చాలామంది స్మైలీ ఎమోజీలతో స్పందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)