ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయి !

Telugu Lo Computer
0


న్డీఏలో చేరతానంటూ బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తనను కలిశారంటూ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఒక ఫైటర్, చీటర్‌తో కలవరని మోడీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జుమ్లా పార్టీ ఇన్ ఇండియా అని విమర్శించారు. ఎన్డీఏలో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో పార్టీలు ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాయన్నారు. ఎన్డీఏలో చేరేందుకు తామేం పిచ్చి కుక్కలం కాదని, తమకు పిచ్చి కుక్కలు ఏం కరవలేదని అన్నారు. ప్రధాని మోడీ యాక్టింగ్‌కు ఆస్కార్ తప్పక వస్తుందని, ఇదే స్క్రిప్టు రాస్తే సినిమాకి బాగా విజయవంతం అవుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీతో దోస్తీ ఎలా ఉంటుందో టీడీపీ, ఎస్ఏడీ చూశాయని అన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో సీబీఐ, ఈడీ, ఐటీ మాత్రమే ఉన్నాయన్నారు. ఎన్డీఏను వీడిన పార్టీలపైకి ఈడీ, సీబీఐలను పంపుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో చేరిన నేతలను దర్యాప్తు సంస్థలు వదిలేస్తాయన్నారు. ఎన్డీఏ మునిగిపోయే నావ అని, అది ఎక్కాలని ఎవరూ అనుకోరన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్ డబ్బు పంపిస్తే ఐటీ ఏం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. తాను సీఎం కావడానికి మోడీ అనుమతి అవసరం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల వయస్సులో మోడీ పచ్చి అబద్దాలు చెప్పారన్నారు. అబద్ధాలతో ప్రధాని పదవి గౌరవాన్ని మోడీ తగ్గించారన్నారు కేటీఆర్. ఎన్డీఏతో చేరాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. మీడియాను ఎదుర్కొనే ధైర్యం కూడా ప్రధాని మోడీకి లేదన్నారు. డీలిమిటేషన్ పై విస్తృత చర్చ జరగాల్సి ఉందని.. యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో జనాభా భారీగా పెరుగుతోందన్నారు. జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. డీ లిమిటేషన్ పై భవిష్యత్ లో తమ పార్టీతో కలిసివచ్చే రాష్ట్రాలతో చర్చిస్తామని కేటీఆర్ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)