రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


హారాష్ట్రలోని ముంబయిలో రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రదీప్ టెంకర్ ఆత్మహత్య చేసుకున్నారు.ఆయన తన ఇంట్లోనే ఈ దారుణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టెంకర్ ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో ప్రాణాంతకంగా మారి టెంకర్ చనిపోయారని డాక్టర్లు ప్రకటించారు. ఈ ఆత్మహత్యపై వెంటనే స్పందించిన ముంబై పోలీసులు విచారణ చేపట్టారు. మాతుంగా పోలీస్ స్టేషన్ లో ఏడీఆర్ కింద కేసు నమోదు చేశారు. టెంకర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారన్న విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. పోలీసులు ఉన్నతాధికారిగా సేవలు అందించిన ఆయన మరణం స్థానికంగా విషాదాన్ని రేకెత్తించింది. ఈ ఘటనపై పోలీసులు ఉన్నతాధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)