బ్రహ్మ కమలం విశిష్టత !

Telugu Lo Computer
0


బ్రహ్మ కమలాలు హిమాలయాల్లో కనిపించే అరుదైన పుష్పించే మొక్క. వర్షాకాలం మొదలయ్యాక ఆగస్ట్ నుండి సెప్టెంబర్ మధ్య వరకూ ఈ పువ్వులు పూస్తాయి. మొగ్గ తొడిగిన తర్వాత రెండు మూడు వారాలకు బ్రహ్మ కమలం వికసిస్తుంది. అయితే ఈ పుష్పాలు రాత్రపూట మాత్రమే వికసిస్తాయి. వీటి నుంచి వచ్చే పరిమళాలు ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలామంది ఇళ్లలో బ్రహ్మ కమలం మొక్కను పెంచుతారు. అది సరిగా పెరగనట్లైతే తగిన సూర్యరశ్మి అందట్లేదని నిర్ధారించుకోవాలి. వెంటనే దాని సూర్యరశ్మి తగిలే చోటికి  మార్చాలి. తూర్పు, ఆగ్నేయం, వాయవ్య దిశలో ఈ మొక్కను ఉంచడం చాలా మంచిదని చెబుతారు. ఎవరింట్లో అయితే బ్రహ్మ కమలం వికసిస్తుందో అప్పటి వరకూ వారింట్లో ఉన్న సమస్యలు తొలగిపోవడానికి సంకేతంగా భావిస్తారు. పెళ్లికాని వారు బ్రహ్మ కమలాలతో అమ్మవారికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయట!. అలాగే డిప్రెషన్‌లో ఉన్నవారు పూజించినా ఆరోగ్యవంతులవుతారట!. 

Post a Comment

0Comments

Post a Comment (0)