లాలూ కుటుంబానికి బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీ దేవి, కొడుకు తేజశ్వీ యాదవ్ సహా ఆర్జేడీ ఎంపీ మీసా భారతికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 16కు వాయిదా వేసింది. వీళ్లందరిపైనా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. 2004 నుంచి 2009 వరకు లాలూ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ సమయంలో గ్రూప్ డీ ఉద్యోగాల ఇచ్చేందుకు పలువురు వ్యక్తుల నుంచి భూమిని లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో జులై 3న సీబీఐ లాలూ ప్రసాద్ యాదవ్ సహా ఇతరులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఆ చార్జ్‌షీట్‌లో రైల్వే నిబంధనలు, మార్గదర్శకాలును ఉల్లంఘించి సెంట్రల్ రైల్వేస్‌లో అభ్యర్థుల అక్రమ నియామకాలు జరిగాయని సీబీఐ అభియోగాలు మోపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)