పానీపూరి తిని 40 మంది పిల్లలకు అస్వస్థత

Telugu Lo Computer
0

జార్ఖండ్ లోని కోడెర్మాలో రోడ్డు పక్కన వ్యాపారి దగ్గర పానీపూరి తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగై 40 మంది అస్వస్థతలకు గురయ్యారని ఆరోగ్య అధికారులు శనివారం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం లోకై పంచాయతీ పరిధిలోని గోసైన్ తోలా వద్ద పానీపూరీ తిన్నట్లు అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. పానీ పూరి తిన్న తర్వాత పిల్లలకు, మహిళలకు వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారని, బ్యాక్టీరియ ఇన్ఫెక్షన్ వల్ల బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బాధితులను కోడెర్మాలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచారు. పిల్లలు 9 నుంచి 15 ఏళ్ల వయసు ఉన్నవారే అని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నుంచి మిగిలిన ఆహార పదార్థాలను పరీక్షల నిమిత్తం రాంచీకి పంపినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)