ఐసీసీ పళ్ళు లేని పులి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 16 September 2023

ఐసీసీ పళ్ళు లేని పులి !


అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) పళ్ళు లేని పులిలా మారిపోయిందని శ్రీలంక మాజీ కెప్టెన్‌ అర్జున రణతుంగ విమర్శించాడు. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌, భారత్‌ మ్యాచ్‌కు మాత్రమే రిజర్వ్‌ డే కేటాయించడంపై అతనిలా వ్యాఖ్యానించాడు. ''ఐసీసీ అనేది ఓ దంతాలు లేని పులి. వృత్తి రహితంగా అది వ్యవహరిస్తోంది. క్రికెట్‌ను కాపాడేది ఐసీసీనే అని భావిస్తున్నా. క్రికెట్‌ను ఐసీసీ నియంత్రించాలి కానీ వేరే దేశం కాదు. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్‌ కోసం నిబంధనలు మార్చారు. ఇక ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ), ఐసీసీ ఎక్కడున్నాయి? ఇప్పుడిక ప్రపంచకప్‌లో భారత్‌- పాక్‌ పోరుకు ప్రత్యేక నిబంధనలు పెట్టినా, రిజర్వ్‌డే ప్రకటించినా నాకు ఆశ్చర్యం కలగదు. ఇది సరికాదు. భారత్‌ శక్తిమంతమైన క్రికెట్‌ దేశం అనడంలో సందేహం లేదు. కానీ ఐసీసీ ప్రతినిధులు చక్కగా కోటు ధరించి, సమావేశాల్లో పాల్గొని వెళ్లిపోతామంటే ఎలా? ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. ఒక్క జట్టు కోసం నిబంధనలు మార్చుకుంటూ పోతే భవిష్యత్‌లో వైఫల్యం తప్పదు. ఐసీసీ, ఏసీసీ పట్ల విచారిస్తున్నా. వీటికి అధికారం మాత్రమే కావాలి. అలాగే డబ్బులు అవసరమైన మాజీ క్రికెటర్లు కూడా నోరు మెదపడం లేదు'' అని రణతుంగ పేర్కొన్నాడు.

No comments:

Post a Comment