ఐఆర్‌సీటీసీ 7 పుణ్య క్షేత్రాల దర్శన ప్యాకేజ్ !

Telugu Lo Computer
0


ఆర్‌సీటీసీ పుణ్య క్షేత్ర యాత్ర సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతోంది. అక్టోబర్ 12న ఈ టూర్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈ టూర్ 9 రాత్రులు/10 రోజులు ఉంటుంది. ఈ టూర్‌లో మూడు కేటరిగిలు ఉన్నాయి. ఎకానమీ కేటగిరి అయితే డబుల్/ట్రిపుల్ షేరింగ్ ధర రూ. 16,400 ఉంటుంది. అదే స్టాండర్డ్ కేటగిరి అయితే టూర్ ధర రూ. 25,500గా ఉంటుంది. డబుల్/ ట్రిపుల్ షేరింగ్‌కు ఇది వర్తిస్తుంది. ఇంకా కంఫర్ట్ కేటగిరి అయితే ధర రూ. 33,300గా ఉంటుంది. డబుల్/ ట్రిపుల్ షేరింగ్‌కు వర్తిస్తుంది. ఇక చైల్డ్ (5- 11 ఏళ్లు) అయితే రూ. 15,200 నుంచి పడుతుంది. కేటగిరి ఆధారంగా ఈ రేటు మారుతుంది. ఈ టూర్‌లో భాగంగా పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి పుణ్య క్షేత్రాలను చూసి రావొచ్చు. జగనాథ టెంపుల్, సన్ టెంపుల్, బీచ్, విష్ణు పాద టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్, అన్నపూర్ణ దేవీ టెంపుల్, గంగా హారతి, రామ జన్మ భూమి, సరయు నది, త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్ ఇలా పలు రకాల ప్రదేశాలను చూసి రావొచ్చు. ఈ టూర్ సికింద్రాబాద్ నుంచి ఉంటుంది. ఖాజీపేట, ఖమ్మం, విజయవాడ , ఏలూరు , రాజమండ్రి , సామర్లకోట, పెందూర్తి, విజయనగరం రైల్వే స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కొచ్చు. టూర్ ప్యాకేజ్‌లో భాగంగా ట్రైన్ జర్నీ టికెట్లు, రాత్రి బస, వాష్ అండ్ కేంజ్, ట్రాన్స్‌పోర్ట్ వంటివి అన్నీ కవర్ అవుతాయి. మార్నింగ్ టీ, బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ వంటివి కూడా టూర్ ప్యాకేజ్‌లో భాగంగా అందిస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ట్రైన్‌లో సెక్యూరిటీ, టూర్ ఎస్కార్ట్స్ కూడా ఐఆర్‌సీటీసీనే చూసుకుంటుంది. ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు కూడా టూరిస్ట్‌లతో పాటుగా జర్నీ చేస్తారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)