సోనియా గాంధీ లేఖ జవాబిచ్చిన కేంద్రం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

సోనియా గాంధీ లేఖ జవాబిచ్చిన కేంద్రం !


సోనియా గాంధీ లేఖకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానమిచ్చారు. పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశానికి పిలుపునిచ్చారని చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభానికి ముందు ప్రభుత్వం అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతుందని, ఈ సంభాషణలు సెషన్ ప్రారంభమయ్యే ముందు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇక సెషన్ ప్రారంభమయ్యే ముందు సెషన్ ఎజెండా ఏంటో ఎప్పుడూ చెప్పలేదని, అలాగే ఇప్పుడు కూడా చెప్పలేదని సోనియాకు రాసిన ప్రతిస్పందనలో ప్రహ్లాద్ జోషి అన్నారు. ''మన ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు పనితీరును రాజకీయం చేయడం, వివాదాలు లేని చోట అనవసర వివాదాలు సృష్టించడం అత్యంత దురదృష్టకరం. మీకు తెలిసినట్లుగా, పార్లమెంటు సమావేశాలు 85వ అధికరణం ప్రకారం రాజ్యాంగ ఆదేశానికి అనుగుణంగా క్రమం తప్పకుండా జరుగుతాయి. దీని ప్రకారం రాష్ట్రపతి ఎప్పటికప్పుడు ప్రతి పార్లమెంటు సభను తను నిర్ణయించుకునే సమయంలో ప్రదేశంలో సమావేశపరచాలి. ఒక సెషన్ చివరి సమావేశానికి తదుపరి సెషన్ మొదటి సమావేశానికి నిర్ణయించిన తేదీకి మధ్య ఆరు నెలల గ్యాప్ ఉండకూడదనే విషయం మీకు బాగా తెలుసు” అని అన్నారు. బహుశా మీరు సంప్రదాయాలపట్ల శ్రద్ధ చూపడం లేదనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలను నిర్వహించే ముందు రాజకీయ పార్టీలు ఎప్పుడూ చర్చకురావని, సమస్యల గురించి ఎప్పుడూ చర్చ చేయలేదని, సెషన్‌ను రాష్ట్రపతి పిలిచిన అనంతరం సెషన్ ప్రారంభానికి ముందు, అన్ని పార్టీల నాయకుల సమావేశం ఉంటుందని అన్నారు. ఇందులో పార్లమెంటు సమస్యలు, పనితీరుపై చర్చిస్తారని ఆయన అన్నారు. అంతకుముందు, ప్రతిపక్ష కూటమి ఇండియా తరపున తొమ్మిది అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ రాశారు. సెప్టెంబరు 6వ తేదీ ఉదయం ప్రధాని మోదీకి సోనియా గాంధీ రాసిన లేఖలో ఎలాంటి చర్చ లేకుండానే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక సమావేశాల ఎజెండాను జారీ చేస్తున్నామని, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాను విడుదల చేయకపోవడం దురదృష్టకరమని కూడా లేఖలో సోనియా అన్నారు.

No comments:

Post a Comment