ఒకే ఒక్క చలానా జీవితాన్ని మార్చేసింది !

Telugu Lo Computer
0


సోం లోని గోపూర్ ప్రాంతానికి చెందిన దిబాకర్ కోయిరాలా  స్థానికంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇటీవల ఆయనకు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేదని 500 రూపాయల చలానా వేశారు. దీనిపై కోయిరాలా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఎందుకు చలానా వేశారంటూ గొడవకు దిగాడు. పోలీసులు మాత్రం ఫైన్ కట్టాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. చేసేది లేక ట్రాఫిక్ చలానా కట్టాడు. తన టూ వీలర్ ను 80 వేల రూపాయలకు అమ్మేశాడు. ఆ వెంటనే ఆరు వేల రూపాయలకు ఓ గుర్రం కొన్నాడు. ఇంటి నుంచి తన దుకాణానికి ఫ్రెండ్స్, హోటల్స్, ఇలా ఎక్కడికయినా గుర్రంపైనే వెళుతున్నాడు. కూరగాయాల మర్కెట్ కు గుర్రంపైనే వెళ్లి అక్కడే దానికి తిండి పెడుతున్నాడు. ఎంతచక్కా రెండు పనులు ఒకేసారి అవుతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు కోయిరాలా. ఇప్పుడు చాలా హాయిగా ఉందని, హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రాఫిక్ లో ఆగాల్సిన పని లేదు. పెట్రోల్ బంకులకు వెళ్లాల్సిన పని లేదు. ట్రాఫిక్ చలాన్లు లేవు. ఏ గోల లేకుండా హాయిగా ఉందంటున్నాడు. గతంలో పెట్రోల్ కొట్టించుకునేవాడిని, ఇప్పుడు గుర్రానికి గడ్డి కొంటున్నాను. అది కూడా సగం ధరలోనే అయిపోతుందంటూదిబాకర్ కోయిరాలా  చెప్పుతున్నాడు. ఏదిఏమైనా ఒకే ఒక్క చలానా అతని జీవితాన్ని మార్చేసింది.. ప్రశాంతమైన జీవితానికి మార్గం చూపించింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Post a Comment

0Comments

Post a Comment (0)