ఎఫ్‌టీఐఐ కొత్త అధ్యక్షుడిగా మాధవన్‌ !

Telugu Lo Computer
0


టుడు ఆర్.మాధవన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా, పాలక మండలి ఛైర్మన్‌గా నామినేట్ అయ్యారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా కేంద్ర మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడికి తన శుభాకాంక్షలు తెలిపారు. అపారమైన అనుభవం, బలమైన నీతి ఈ ఇన్‌స్టిట్యూట్‌ను సుసంపన్నం చేస్తుందని, సానుకూల మార్పులను తీసుకువస్తుందని, ఉన్నత స్థాయికి తీసుకువెళతాయని తాను భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. విలక్షణ నటుడు ఆర్‌ మాధవన్ స్వీయ దర్శకత్వంలో నటించిన సినిమా 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌' ఇటీవలే ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డును అందుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)