సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్లు ముద్రించకూడదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 2 September 2023

సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్లు ముద్రించకూడదు !


డిగ్రీలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లపై విద్యార్థుల ఆధార్ నంబర్ల ముద్రణపై యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లపై ఆధార్‌ నంబర్లు ముద్రించకూడదంటూ దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలను ఆదేశించింది. రిక్రూట్‌మెంట్ లేదా అడ్మిషన్ సమయంలో పేర్కొన్న పత్రాల వెరిఫికేషన్‌లో తదుపరి ఉపయోగం కోసం తాత్కాలిక సర్టిఫికెట్లు, విశ్వవిద్యాలయాలు జారీ చేసే డిగ్రీలపై పూర్తి ఆధార్ నంబర్‌లను ముద్రించడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరిశీలిస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ రెగ్యులేషన్స్‌ 2016 చట్టంలోని రెగ్యులేషన్ 6, సబ్-రెగ్యులేషన్ (3) ప్రకారం ఏ విద్యా సంస్థ విద్యార్థుల ఆధార్ నంబర్లతో కూడిన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు పంపిన సెప్టెంబర్ 1 నాటి లేఖలో యూజీసీ కార్యదర్శి మనోజ్ జోషి పేర్కొన్నారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.

No comments:

Post a Comment