అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 19 September 2023

అక్టోబర్ 15 నుంచి ఇంద్రకీలాద్రి పై దసరా మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇంద్రకీలాద్రి పై అక్టోబర్ 15 నుంచి 23 తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించబోతున్నట్లు ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు మీడియాకు తెలిపారు. అక్టోబర్‌ 15న ఉత్సవాల తొలిరోజు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారని తెలిపారు. అనంతరం 16న శ్రీ గాయత్రీ దేవి అలంకారం, 17 న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం, 18 న శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారం, 19న శ్రీ మహాచండీ దేవి అలంకారం, 20 న శ్రీ సరస్వతీ దేవి అలంకారం (మూలానక్షత్రం)లో అమ్మవారు దర్శనం ఇస్తారని తెలిపారు. అక్టోబర్ 20న మధ్యాహ్నం 3గంటల నుంచీ 4 గంటల మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అని కర్నాటి రాంబాబు తెలిపారు. అక్టోబర్ 21 న శ్రీ లలితా త్రిపురసుందరీ అలంకారం, 22న శ్రీ దుర్గాదేవి అలంకారం, 23న శ్రీ మహిషాసురమర్ధనీ దేవిఅలంకారం, మధ్యాహ్నం నుంచీ శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment