ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడండి !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని లాల్‌బాఘ్ మైదానంలో జరిగిన బహిరంగసభలో అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ ఇండియా మీ నాన్నగారిది అనుకుంటున్నారా ? ఇండియా 140 కోట్ల భారతీయులది. ఇండియా భారతీయుల గుండెల్లో ఉంది. హిందుస్థాన్ భారతీయుల గుండెల్లో ఉందని ధైర్యముంటే దేశం పేరు మార్చి చూడమని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా బీజేపీ ప్రభుత్వం గతేడాది ఇండియా పేరుమీద అనేక కార్యక్రమాలను జరిపిందని గుర్తుచేశారు. అనంత్‌నాగ్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు భారత సైనికులు మృతిచెందారు. వారి కుటుంబాన్ని చూసి యావత్ దేశమంతా తల్లడిల్లింది కానీ భారత ప్రధానికి కొంచెమైనా బాధ కలగలేదా అని ప్రశ్నించారు. వారు చనిపోయి నాలుగు రోజులు కావస్తున్నా ఇంతవరకు నోరువిప్పలేదే అని ప్రశ్నించారు.  ఛత్తీస్‌గఢ్‌లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే మా ప్రధాన లక్ష్యమని చెబుతూ భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క పార్టీ కూడా విద్య గురించి మాట్లాడింది లేదు. కానీ మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం విద్యార్థులందరికీ మెరుగైన విద్యను అందించి పేదరికాన్ని నిర్మూలించడమే మా సంకల్పమని అన్నారు. అంతకుముందు రాయ్‌పూర్‌లో జరిగిన బహిరంగసభలో ఛత్తీస్‌గఢ్‌లో 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని నగరాల్లోనూ గ్రామాల్లోనూ 24 గంటలూ విద్యుత్ అందిస్తామని హామీనిచ్చారు అరవింద్ కేజ్రీవాల్. 

Post a Comment

0Comments

Post a Comment (0)