యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్ ఇస్రోకు అభినందనలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 14 September 2023

యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్ ఇస్రోకు అభినందనలు !


గస్టు 23న చంద్రయాన్‌-3 ప్రయోగం జరిగింది. దీనిని ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షించారని రెండు రోజుల క్రితం యూట్యూబ్ ఇండియా వీడియోను పోస్టు చేసింది. 'కొన్ని విషయాలు మమ్మల్ని మైమరపించాయి. భారత్ చంద్రుడిపై ల్యాండ్ అయింది. ఆ రోజు యూట్యూబ్‌లో ఇస్రో లైవ్‌స్ట్రీమింగ్‌ను ఏకకాలంలో 8 మిలియన్ల (80 లక్షలు) మంది వీక్షించారు. మా ఆనందానికి పట్టపగ్గాలు లేవు' అని రాసుకొచ్చింది. తాజాగా ఈ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ యూట్యూబ్‌ సీఈఓ నీల్‌ మోహన్ ఇస్రోకు అభినందనలు తెలిపారు. 'ఏకకాలంలో 80 లక్షల మంది వీక్షకులా నమ్మశక్యంగా లేదు. అద్భుతం'అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే యూట్యూబ్‌  షేర్ చేసిన 16 సెకండ్ల క్లిప్‌లో.. ల్యాండింగ్ సమయంలో ఇస్రో కంట్రోల్‌ రూమ్‌లో చోటుచేసుకున్న ఉద్విగ్న పరిస్థితులను బంధించారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో భాగంగా గతనెల జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద ల్యాండర్‌ సురక్షితంగా దిగింది. ఆ తర్వాత ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అధ్యయనం చేసింది. అక్కడ పగటికాలం ముగియడంతో ప్రస్తుతం అవి నిద్రాణంలోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఈ నెల 22న అక్కడ సూర్యోదయమవుతుందని ఇస్రో తెలిపింది. ఆ రోజున అవి మళ్లీ తిరిగి మేలుకుంటాయని ఆశిస్తోంది.

No comments:

Post a Comment