ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదు !

Telugu Lo Computer
0


యిదు రోజుల ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు పార్లమెంట్ 75 ఏళ్ల ప్రయాణంపై చర్చ జరుగుతోంది. 75 ఏళ్ల పార్లమెంట్ ప్రమాణంలో సాధించిన విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు చర్చించనుండగా, ప్రధాని మోడీ ప్రసంగించి చర్చను ప్రారంభించారు. రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు కొత్త భవనంలో జరగనున్న నేపథ్యంలో పాత భవనంతో జ్ఞాపకాలను మోడీ గుర్తు చేసుకున్నారు. ఇదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన పై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వంటి పలు రాష్ట్రాల ఏర్పాటుకు ఈ భవనం వేదికైందని అన్నారు. అయితే యూపీఏ హయాంలో ఆంధ్రప్రదేశ్ విభజన సరిగ్గా జరగలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనలో ఏపీ, తెలంగాణ ఇరు వర్గాలు అసంతృప్తికి గురయ్యారని మోడీ అన్నారు. ఈ చారిత్రక భవనం నుండి మనం వీడ్కోలు తీసుకుంటున్నామన్నారు. స్వాతంత్ర్యానికి ముందు ఈ భవనం ఇంపీరియల్ లెజిస్లేచర్ కౌన్సిల్ గా ఉండేదనీ, చారిత్రక ఘట్టాలకు వేదిక అయ్యిందన్నారు. మనం కొత్త భవనంలోకి వెళ్లినా, పాత భవనం మనకు నిరంతర ప్రేరణగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశాల్లో పోస్టాఫీసు బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్, మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి బిల్లులను కూడా ప్రవేశపెట్టనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)