బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ !

Telugu Lo Computer
0


ప్రత్యేక ఎజెండాతో ప్రారంభమవుతున్న ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని తమ ఎంపీలకు బీజేపీ గురువారం విప్ జారీ చేసింది. పార్లమెంట్ పాత భవనంలో ఈ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ముందుగానే బీజేపీ జాబితా సిద్ధం చేసింది. పార్లమెంటరీ వ్యవహారాలపై చర్చించాలని ఎంపీలను కోరింది. మొదటిరోజు సమావేశంలో పార్లమెంట్ 75 ఏళ్ల ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చర్చించనున్నారు. తర్వాత 5 బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదించిన ది అడ్వకేట్స్ సవరణ బిల్లు 2023, ద ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు2023, లోక్‌సభ ముందుకు రానున్నాయి. రాజ్యసభలో ఆగస్టు 10న ప్రవేశ పెట్టిన పోస్టాఫీస్‌ల బిల్లు 2023, ది ప్రధాన ఎన్నికల కమిషనర్ , ఇతర కమిషనర్ల (అపాయింట్‌మెంట్, కండీషన్స్ ఆప్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ) బిల్లు 2023,జులై 27న లోక్‌సభ ఆమోదించిన వివిధ నిరర్ధక చట్టాల రద్దుకు సంబంధించిన ది రిపీలింగ్‌అండ్ అమెండింగ్ బిల్లు 2023 రానున్నాయి. పోస్టాఫీస్, ఎన్నికల కమిషనర్ బిల్లులు రాజ్యసభలో పాసైన వెంటనే లోక్‌సభలో ప్రవేశ పెట్టి పాస్ చేయనున్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని సెప్టెంబర్ 19 నుంచి ఈ సమావేశాలను కొత్త భవనం లోకి మార్చనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లోనే కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది. పార్లమెంట్‌లో జరగబోయే ప్రత్యేక సమావేశాలకు ప్రతి ఎంపీ హాజరు కావాలని కోరింది.

Post a Comment

0Comments

Post a Comment (0)