ఇండిగో విమానంలో మహిళపై అసభ్య ప్రవర్తన ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 11 September 2023

ఇండిగో విమానంలో మహిళపై అసభ్య ప్రవర్తన !


ముంబై-గౌహతి మధ్య ఇండిగో ఫ్లైట్ 6E-5319లో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో అతనిని అరెస్టు చేశారు.  విమానం గౌహతి విమానాశ్రయానికి చేరుకోగానే నిందితుడిని గౌహతి పోలీసులకు అప్పగించినట్లు ఎయిర్‌లైన్ సోమవారం తెలిపింది. “ఫిర్యాదుదారు స్థానిక పోలీసులకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. అవసరమైన చోట దర్యాప్తులో ఎయిర్‌లైన్ సహాయం అందిస్తుంది” అని ఇండిగో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సంఘటన గురించి ఇండిగో ఎటువంటి తదుపరి సమాచారాన్ని తెలపలేదు. బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ఫ్లైట్ లైట్లు డిమ్‌గా ఉన్నాయని.. నిద్రిస్తున్న సమయంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆర్మ్‌రెస్ట్ పైకి లేచి ఒక వ్యక్తి తనపైకి వంగి ఉన్నట్లు ఆమె పేర్కొంది. కొంతసేపటి తర్వాత చేయి తనపై వేశాడని.. కానీ కళ్లు తెరవకుండా అలానే పడుకున్నట్లు యాక్టింగ్ చేసినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత ప్రయాణికుడు తనను అనుచితంగా తాకడం ప్రారంభించినట్లు మహిళ పేర్కొంది. దీంతో ఆ మహిళ సీటు లైట్‌ను ఆన్ చేసి క్యాబిన్ సిబ్బందికి ప్రయాణికుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. క్యాబిన్ సిబ్బంది రాగానే నిందితుడు క్షమాపణ చెప్పాడని.. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎయిర్‌లైన్స్ నిందితుడిని పోలీసులకు అప్పగించినట్లు బాధిత మహిళ చెప్పింది.

No comments:

Post a Comment