నిద్రలేమి - అనర్ధాలు !

Telugu Lo Computer
0


నిషి సగటున 7 లేదా 8 ఖచ్చితంగా నిద్రపోవాలి. ఈరోజుల్లో ఎక్కువ మంది ఆరు గంటల కన్నా తక్కువగా నిద్రపోతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడం వల్ల గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. నిద్రలేమి కారణంగా గుండె జబ్బుల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ 6 గంటల కంటే తక్కువగా నిద్రపోయే వారిలో గుండెపోటు, కరోనరీ ఆర్టరీ డిసీస్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నిద్రలేమి కారణంగా అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. అధిక రక్తపోటు గుండె జబ్బులకు ప్రధాన కారణం. ఈ అధిక రక్తపోటు కారణంగా గుండెపై కలిగే అధిక ఒత్తిడి ధమనుల ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా ధమనులు గట్టిపడతాయి. రక్తప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుంది. గుండెలో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది..అలాగే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వస్తాయి.. దీనివల్ల హార్ట్ ఎటాక్ వస్తుంది.. ఈ మధ్య కాలంలో హార్ట్ ఎటాక్ ఎక్కువగా వస్తుంది. నిద్రలేమి కారణంగా మన శరీరం బరువు విపరీతంగా పెరుగుతుంది. ఇది క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. ఊబకాయానికి గుండె సమస్యలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. నిద్రలేమి ఇలా పరోక్షంగా కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే నిద్రలేమి కారణంగా శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు పెరిగి మధుమేహం బారిన పడే అవకాశం ఉంది.. అలాగే నిద్రలేమి కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విధంగా నిద్రలేమి మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని గుండె సంబంధిత సమస్యలు తలెత్తిన తరువాత బాధపడడం కంటే ముందుగానే జాగ్రత్త తీసుకోవడం అవసరమని వారు చెబుతున్నారు.. ఈ సమస్యల బారిన పడకుండా ఉండాలంటే రోజుకు ఆరు గంటలు తప్పక నిద్రపోవాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)