డేనియల్ తుఫాన్ ధాటికి మృతుల దిబ్బగా మారిన లిబియా - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 September 2023

డేనియల్ తుఫాన్ ధాటికి మృతుల దిబ్బగా మారిన లిబియా


ఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుఫాన్ జలప్రళయాన్ని సృష్టించింది. వర్షాల ధాటికి రెండు జలశయాలు బద్దలైపోయాయి. దీంతో ప్రజలు వరదల్లో కొట్టుపోయారు. వరదల ధాటికి సమీపంలో ఉన్న సముద్రంలోకి ప్రజలు కొట్టుకుపోయారు. ముఖ్యంగా లిబియాలోని తూర్పు నగరమైన డెర్నా దారుణంగా దెబ్బతింది. నగరంలో ఎక్కడా చూసిన మృతదేహాలే కనిపిస్తున్నాయి. వరదల కారణంగా నగరం మొత్తం బురదతో నిండిపోయింది. బురదలో చనిపోయిన వారి మృతదేహాలు కనిపిస్తుండటంతో ఆ ప్రాంతం అంతా స్మశానాన్ని తలపిస్తోంది. వరదల వల్ల చనిపోయిన వారి సంఖ్య 11,300కి చేరుకుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మరో 10,100 మంది ఆచూకీ కనిపించలేదని వెల్లడించింది. డెర్నా కాకుండా తూర్పు లిబియాలోని మరో చోట వరదల వల్ల 170 మంది మరణించారు. డేనియల్ తుఫాను ఈశాన్య లిబియాను తాకిత తర్వాత భారీ వర్షాలు సంభవించాయి. దీంతో ప్రళయం ఏర్పడింది. డెర్నా నగరంలో తాగునీటి సమస్యలు ఏర్పడ్డాయి. కలుషిత నీటిని తాగి 55 మంది చిన్నారులు తీవ్ర అనారోగ్యం పాలయ్యారని యూఎన్ పేర్కొంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య 20,000 వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. లిబియా గత కొన్నేళ్లుగా తీవ్రమైన సంక్షోభాలను ఎదుర్కొంటోంది. అంతర్యుద్ధం, మానవ సంక్షోభం వంటి సమస్యలను చూస్తోంది. తాజాగా ఈ విపత్తు దేశ పరిస్థితిని మరింత దిగజార్చింది. 

No comments:

Post a Comment