మేకకు కూడా టికెట్‌ తీసుకున్న మహిళ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 6 September 2023

మేకకు కూడా టికెట్‌ తీసుకున్న మహిళ !


శ్చిమ బెంగాల్‌లో ఒక వృద్ధురాలు తన భర్తతోపాటు మేకతో కలిసి రైలులో ప్రయాణించింది. ఇంతలో టికెట్‌ తనిఖీ చేసే రైల్వే అధికారి ఆ మహిళ వద్దకు వచ్చాడు. ఆమెతోపాటు మేక ఉండటాన్ని చూశాడు. రైలు టికెట్‌ చూపమని ఆ మహిళను అడిగాడు. వెంట ఉన్న మేక కోసం కూడా టికెట్‌ తీసుకున్నావా అని ప్రశ్నించాడు. కాగా, ఆ వృద్ధురాలు ఏ మాత్రం బెదరలేదు. మేక కోసం కూడా రైలు టికెట్‌ తీసుకున్నట్టు నవ్వుతూ హుందాగా చెప్పింది. ఆ టికెట్‌ను టీటీఈకి చూపించాలని తన భర్తతో అన్నది. ఆ వ్యక్తి రైలు టికెట్‌ను అతడికి చూపించాడు. ఆ టికెట్‌లో ఇద్దరు వ్యక్తులతోపాటు మేక ప్రయాణానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఇది చూసి ఆ టీటీఈ ఆశ్చర్యపోయాడు. ఆ వృద్ధురాలి నిజాయితీ, గౌరవానికి ఫిదా అయ్యాడు. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ వీడియో గ్రెటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అని నెటిజన్లు కొనియాడారు. ఆ మహిళకు మేక కేవలం ఒక జంతువు కాదని, ఆమె కుటుంబంలో భాగమని మరొకరు వ్యాఖ్యానించారు. ఆ వృద్ధురాలి నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని ఒకరు అన్నారు. ఆ మహిళ మనస్తత్వం, గుండె నిబ్బరాన్ని ఆమె నవ్వు చాటుతున్నదని మరొకరు ప్రశంసించారు. సింపుల్‌గా, నిజాయితీగా ఉండే ఇలాంటి భారతీయులు దేశానికి గర్వకారణమని మరికొందరు కొనియాడారు.

No comments:

Post a Comment