మహిళలకు ఉపాధినిస్తున్న చంద్రయాన్-3 - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 11 September 2023

మహిళలకు ఉపాధినిస్తున్న చంద్రయాన్-3


త్తరప్రదేశ్ వారణాశిలోని కొందరు మహిళలు చంద్రయాన్‌ సక్సెస్‌తో కలపతో స్పేస్‌ క్రాఫ్ట్‌లు తయారు చేస్తున్నారు. కళాకారులు తయారు చేస్తున్న ఈ కలప నమూనాలు ఒక్కోటి 700 రూపాయలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇవి దేశంలోని అన్ని ప్రాంతాలతో పాటు విదేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. సింగపూర్‌తో సహా దేశంలోని అనేక మెట్రోపాలిటన్ నగరాల నుండి వారణాశి కళాకారులకు ఆర్డర్‌లు వస్తున్నాయి. దీంతో వారికి చక్కటి ఉపాధి లభిస్తోంది. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ నమూనాను తయారు చేశామని దీనికి మంచి స్పందన రావటంతో మాకు చక్కటి ఉపాధి మార్గాలు దొరికాయని ఆనందం వ్యక్తంచేస్తున్నారు. తాము తయారు చేసిన ఈ చంద్రయాన్‌ మోడళ్లను ప్రధాని మోదీతో పాటు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌కు బహూకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని కళాకారులు తెలిపారు. చంద్రయాన్-3 మోడల్ తయారీలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. ఒక్కో చంద్రయాన్ ను తయారు చేయటానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని క్రాఫ్ట్ డిజైనర్ బీహారీ లాల్ అగర్వాలు చెబుతున్నారు. చంద్రయాన్ -3 దేశానికే గర్వకారణంగా మారటమే కాకుండా చక్కటి ఉపాధి మార్గంగా తయారైందని తెలిపారు. ఇది దేశంతో పాటు వారణాశికి కూడా గర్వకారణమని తెలిపారు. చంద్రయాన్-3 మోడల్ డిజైన్ కు మంచి డిమాండ్ ఉందని దీనికి తమకు వస్తున్న ఆర్డర్లే నిదర్శనమని తెలిపారు.

No comments:

Post a Comment