బల్లి పడిన ఆహారం తిన్న110 మంది విద్యార్థులకు అస్వస్థత !

Telugu Lo Computer
0


జార్ఖండ్ లోని పాకూర్ జిల్లాలో ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో  110 మంది విద్యార్థులు బల్లి పడిన ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గురువారం అధికారులు తెలిపారు. 65 మంది విద్యార్థులను పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లా సమీపంలోని రాంపూర్‌హాట్ లోని ఆస్పత్రికి తరలించారు. మరో 45 మందిని పకురియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఉంచారు. ప్రస్తుతం ముగ్గురు విద్యార్థులు రాంపూర్‌హాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మిగిలిన వారంతా డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. అయితే ఆహారంలో బల్లి కనిపించిందా..? అనేది విచారించాల్సి ఉందని చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)