ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి నిర్మాణానికి శ్రీకారం - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 August 2023

ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి నిర్మాణానికి శ్రీకారం


భారత్ - చైనా సరిహద్దులో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా గత తొమ్మిదేళ్లలో సరిహద్దు రహదారి సంస్థ (బీఆర్‌వో) పలు కీలక ప్రాజెక్టులను విజయవంతంగాపూర్తి చేసింది. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణాత్మక వైఖరి నెలకొనడంతో సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, సైనిక బలగాల వసతి సౌకర్యాలు, హెలిపాడ్లను సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని కీలకమైన ప్రాజెక్టుకు సరిహద్దు రహదారి సంస్థ శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపింది. తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్ లా పాస్ ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో ఉన్న మోటారబుల్ రోడ్‌గా పేరు పొందింది. కొత్తగా బీఆర్‌వో చేపట్టబోయే రోడ్డు నిర్మాణం ఈ రికార్డును అధిగమించనుంది. సముద్ర మట్టం నుంచి 19,400 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు బీఆర్‌వో తెలిపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలనుసైతం ట్వీట్ చేసింది. లికారు - మిగ్ లా-పుక్చే ప్రాంతాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఈ రహదారి నిర్మాణాన్ని 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటారబుల్ రహదారిగా పేరున్న ఉమ్లింగ్ పాస్ సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉంది. దానిని మించిన ఎత్తులో ప్రస్తుతం లికారు-మిగ్ లా-పుక్చే ప్రాంతాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది. తూర్పు లద్దాఖ్ సరిహద్దు ప్రాంతంలో గతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించి అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. దీనికితోడు ఇరు దేశాలకు చెందిన సైనికుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే 18 సార్లు చర్చలు జరగగా.. తాజాగా 19వ సారి ఇరుదేశాల మధ్య కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు ఆగస్టు 13, 14 తేదీల్లో జరిగాయి. ఈ చర్చలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు సుదీర్ఘంగా చర్చించారని, రెండు దేశాల నుంచి కూడాసానుకూల వాతావరణం కనిపించినట్లు భారత విదేశాంగ శాఖ పేర్కొంది.

No comments:

Post a Comment