నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు

Telugu Lo Computer
0


ఫ్రికాలోని నైగర్‌లో సైన్యం సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. జాతీయ టీవీలో నైగర్‌ సైనికులు ఈ తిరుగుబాటును ప్రకటించారు. నైజర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ తిరుగుబాటు తర్వాత దేశ సరిహద్దులన్నీ మూతపడ్డాయి. ఇలా జరగడం ఇదేమీ మొదటిసారికాదు. 1960లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత ఇక్కడ నాలుగుసార్లు తిరుగుబాటు జరిగింది. నైగర్‌కు ముందు జిహాదీ తిరుగుబాటు,ఆ తర్వాత పొరుగు దేశాలైన మాలి, బుర్కినా ఫాసోలలో తిరుగుబాటు జరిగింది. తాజాగా ఈ చిన్న దేశంలో జరిగిన తిరుగుబాటు ప్రపంచ దేశాలలో ఆందోళనను పెంచింది. ముఖ్యంగా అమెరికా, ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నైగర్‌ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను తక్షణమే విడుదల చేయాలని, అలాగే దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కోరారు. నైగర్‌ చాలా పేద దేశం అయినప్పటికీ యురేనియం నిల్వల విషయంలో అగ్రగామిగా ఉంది. ఇదే అమెరికా ఆందోళనను మరింతగా పెంచింది. 80 శాతం భూమి ఎడారిగా ఉన్న దేశంలో చోటుచేసుకున్న సైనిక తిరుగుబాటుతో అమెరికా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా నైగర్‌ అంతర్జాతీయ ఏజెన్సీలకు, అనేక దేశాలకు భారీగా రుణపడి ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారులలో నైగర్‌ ఒకటి. వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ (డబ్ల్యుఎన్‌ఏ) తెలిపిన వివరాల ప్రకారం నైగర్‌ యురేనియం ఉత్పత్తిలో ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం. రేడియోధార్మిక యురేనియం నిల్వలను కలిగి ఉన్న ఈ దేశంలో రాజకీయ తిరుగుబాటు కారణంగా ఇది ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అణుబాంబు, అణుశక్తిలో వినియోగించే యురేనియం నిల్వలున్న ఈ చిన్న దేశంపై అమెరికాతో పాటు ప్రపంచమంతా దృష్టి సారించింది. నైగర్‌..యూరోపియన్ యూనియన్‌కు యురేనియం అందించే ప్రధాన సరఫరాదారు. నైగర్‌ నియంత్రణ సైన్యం చేతికి వచ్చినప్పటి నుంచి ఈ దేశాల్లో ఆందోళన మరింతగా పెరిగింది.

Post a Comment

0Comments

Post a Comment (0)