ప్రధాని నిజం చెప్పడం లేదు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 25 August 2023

ప్రధాని నిజం చెప్పడం లేదు !


చైనా వేలాది కిలోమీటర్ల భారత భూభాగాన్నిఆక్రమించినా ప్రధానమంత్రి  నిజం చెప్పడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. బ్రిక్స్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంభాషించుకున్న వేళ రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ కార్గిల్ లో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత రాహుల్ లద్ధాఖ్ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. లద్ధాక్‌ వ్యూహాత్మక ప్రదేశమని రాహుల్‌ స్పష్టం చేశారు. చైనా ఒక అంగుళం భూమినైనా ఆక్రమించుకోలేదని ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి చెప్పడం విచారకరమని ఇది శుద్ధ అబద్ధమని ఆయన ఆరోపించారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే లక్ష్యంగా తన భారత్‌ జోడో యాత్ర కొనసాగిందని రాహుల్‌ తెలిపారు. రాహుల్ గాంధీ ఈ నెల 17 నుంచి లద్ధాఖ్‌లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం రాహుల్ శ్రీనగర్ వస్తున్నారని జమ్ముకశ్మీరు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వని చెప్పారు. ఈ పర్యటనలో సోనియా గాంధీ కూడా పాల్గొంటున్నారని, వీరిద్దరూ రాజకీయ నేతలను కలవబోరని వెల్లడించారు.

No comments:

Post a Comment