స్కూల్ సిలబస్ తయారీ కమిటీలో సుధామూర్తి, శంకర్ మహదేవన్

Telugu Lo Computer
0


నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ కి చెందిన మూడో తరగతి నుంచి 12వ తరగతి స్కూల్ బుక్స్ కోసం సిలబస్, లెస్సన్స్ రూపకల్పన చేసేందుకు ఏర్పాటుచేసిన కమిటీలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది. నేషనల్ సిలబస్ అండ్ టెస్టింగ్ లెర్నింగ్ మెటీరియల్ కమిటీ (ఎన్ఎస్ టీసీ) లో ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా మూర్తి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, ప్రముఖ ఆర్థిక వేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ కు చోటు లభించింది. మొత్తం 19 మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారని ఎన్ సీఈఆర్ టీ ప్రకటించింది. ఈ కమిటీకి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కు చాన్స్ లర్ గా ఉన్న ఎంసీ పంత్ సారధ్యం వహించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కే. కస్తూరి రంగన్ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ అభివృద్ధి చేసిన కరిక్యులమ్ కు అనుగుణంగానే కొత్త కమిటీ పని చేయనుంది. స్కూల్ సిలబస్ అభివృద్ధి, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ రూపొందించే బాధ్యతలను ఈ కమిటీ చూడనుంది. ఒకటి, రెండో తరగతుల సిలబస్ పై సమీక్ష అవసరమేనని అభిప్రాయపడింది. ఎన్ఎస్ టీసీ అభివృద్ధి చేసి, ఖరారు చేసిన పాఠ్యాంశాలను ఎన్ సీఈ ఆర్ టీ ద్వారా స్కూళ్లకు పంపిణీ చేయనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)