రైల్వే బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హా - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 August 2023

రైల్వే బోర్డుకు ఛైర్‌పర్సన్‌గా జయావర్మ సిన్హా


రైల్వే బోర్డు ఛైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం గురువారం జయావర్మ సిన్హాను నియమించింది. భారతీయ రైల్వేల నిర్వహణలో కీలకమైన రైల్వే బోర్డుకు సీఈఓ, ఛైర్‌పర్సన్‌గా ఓ మహిళ నియమితులు కావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 1వ తేదీన ఆమె ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. పదవీకాలం 2024 ఆగస్టు 31 వరకూ ఉంటుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన జయావర్మ రిటైర్ కావాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కీలక నియామకంతో ఆమె పదవికాలం కొనసాగుతుంది. ఇప్పటివరకూ రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అనిల్‌కుమార్ లాహోటీ స్థానంలో జయావర్మ నియమితులు అయ్యారు. దేశ చరిత్రలో రైల్వేల నిర్వహణ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇది మొదటిసారి అయింది. కేబినెట్‌కు చెందిన అపాయింట్‌మెంట్స్ కమిటీ జయావర్మ నియామకంపై నిర్ణయం తీసుకుందని, ఇప్పటివరకూ ఆమె ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసెస్(ఐఆర్‌ఎంఎస్) సభ్యురాలిగా ఉన్నారు, రైల్వే ఆపరేషన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ బాధ్యతలు కూడా పర్యవేక్షించారు. బాలాసోర్ ఘోర రైలు ప్రమాదంలో దాదాపు 300 మంది వరకూ దుర్మరణం చెందిన ఉదంతం భారతీయ రైల్వేకు మచ్చగా మారింది. దేశంలో ఉన్న సంక్లిష్ట సిగ్నలింగ్ వ్యవస్థ ఇటువంటి రైలు ప్రమాదాలకు దారితీసిందని, దీనిని భారీ స్థాయిలో చక్కదిద్దాల్సి ఉందని జయావర్మ ప్రకటించారు. వార్తలలో నిలిచారు. అలహాబాద్ యూనివర్శిటీ పూర్వపు విద్యార్థిని అయిన జయా ఇండియన్ రైల్వేలో 1988లో చేరారు. నార్తర్న్ రైల్వే, ఈస్టర్న్ రైల్వే, ఎస్‌ఇ రైల్వేలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో భారతీయ హై కమిషన్‌లో నాలుగేళ్లు రైల్వే సలహదారుగా వ్యవహరించారు. ఆమె హయాంలోనే కోల్‌కతా ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్ ఆరంభం అయింది.

No comments:

Post a Comment