ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మహిళా నేత - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 August 2023

ఆత్మహత్య చేసుకున్న బీజేపీ మహిళా నేత


శాన్య రాష్ట్రమైన అస్సాం రాజధాని గౌహతిలో ఒక దారుణం వెలుగు చూసింది. భారతీయ జనతా పార్టీకి చెందిన ఒక మహిళా నాయకురాలు బలవంతంగా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పార్టీలోని ఒక సీనియర్ నాయకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. అయితే ఆయనతో ఆమె గడిపిన కొన్ని వ్యక్తిగత క్షణాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో నిమగ్నమై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న ఆ మహిళ నేతను ఇంద్రాణి తహబిల్దార్ (భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ప్రముఖ సభ్యురాలు)గా గుర్తించారు. ఆమె వయసు 48 ఏళ్లు. బామునిమైదాం ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇంద్రాణి ఇటీవలే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె పార్టీ కిసాన్ మోర్చాలో కూడా ఉన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బీజేపీలో ఆమె కంటే సీనియర్‌ అయిన ఒక వ్యక్తి ఇంద్రాణి తహబీల్దార్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారిద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా మారారు. ఇది కాస్త ఇరువురి మధ్య శారీరక సంబంధం వరకు చేరింది. అయితే ఈ విషయం ఇంద్రాణీ భర్తకు తెలియదు. ఎవరికీ తెలియకుండా అప్పుడప్పుడూ కలుస్తూ ఉండేవారు. అయితే శుక్రవారం రాత్రి ఇంద్రాణి తహబీల్దార్‌ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందే వరకు ఈ రహస్యం బయటికి తెలియలేదు. అద్దెకు ఉంటున్న పార్టీ సీనియర్ నేతతో సన్నిహితంగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గౌహతి మెడికల్ కాలేజీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ విషయమై సెంట్రల్ గౌహతి డీసీపీ దీపక్ చౌదరి మాట్లాడుతూ.. మరణించిన మహిళ మరొక వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు లీక్ కావడంపై పోలీసులకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని, అయితే ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నామని, ఈ విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. మరోవైపు, ఈ సంఘటనతో మొత్తం నగర ప్రజలు షాకుకు గురయ్యారు. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్న బీజేపీ నాయకురాలు ఇంద్రాణి తహబీల్దార్ ఇంత దారుణమైన చర్య తీసుకున్నారంటే ఎవరూ నమ్మలేకపోతున్నారని స్థానికులు చెప్పారు.

No comments:

Post a Comment