డెలివరీ బాయ్ పేరుతో రూ.25 వేలు శఠగోపం !

Telugu Lo Computer
0


బెంగళూరు లో శిల్పా సర్నోబాత్ (64) అనే మహిళ ఆగస్టు 6న ఫుడ్ ఆర్డర్ చేశారు. కాని కొన్ని నిమిషాల తరువాత ఆ ఆర్డర్ ను రద్దు చేశారు. అయితే ఆమె ఆర్డర్ పెట్టిన సంస్థ కేన్సిలేషన్ ఛార్జీలు విధించింది. ఆ తరువాత ఆమె రొటీన్ వర్క్ లో కి వెళ్లిపోయింది. అయితే రెండు రోజుల తరువాత ఆమె ఇంటి పనుల్లో బిజీగాఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను ఫుడ్ డెలివరీ సంస్థ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానని, మీరు ఆర్డర్ చేసి రద్దు చేసిన ఫుడ్ డెలివరీకి సంబంధించి కేన్సిలేషన్ చార్జీలు తిరిగి ఇస్తామని ఆమె ఆర్డరిచ్చిన ఫుడ్ వివరాలు షేర్ చేసుకున్నాడు. శిల్పాను ఆ గుర్తు తెలియని వ్యక్తి మాటలతో నమ్మించి రిమోట్ డెస్క్ అప్లికేషన్ డౌన్ చేయించాడు. తరువాత అతని సూచనల ప్రకారం బ్యాంక్ ఖాతా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చింది. మరో గంటలో మీ ఖాతాలో సంస్థ వసూలు చేసిన కేన్సిలేషన్ చార్జీలు మీ ఖాతాలో జమ అవుతాయని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇక అంతే ఆమె ఖాతా నుంచి రూ. 25 వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే ఖంగుతిన్న ఆ మహిళ ఆ నెంబరుకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మోసపోయానని గ్రహించిన శిల్పా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)