డ్యూటీ పోలీసుపై మహిళ దౌర్జన్యం !

Telugu Lo Computer
0


మహిళ డ్యూటీలో ఉన్న పోలీసు ఆఫీసర్‌పై చేయి చేసుకుంది. దీంతో ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. నెటిజన్లు పోలీసులపై దాడికి పాల్పడడం ఖండిస్తున్నారు.  ఈ వీడియోలో ఉన్న ప్రకారం.. డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ పై మహిళ తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆ మహిళ తన ముందు నిలబడి ఉన్న కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టింది. అంతేకాదు పోలీస్‌తోపాటు మరో వ్యక్తి ఆమెను వారిస్తున్నప్పటికీ.. బులావ్ ట్రాఫిక్ వాలేకో అంటూ అతన్ని బెదిరించడం లాంటిది చేస్తుంది. ఈ వీడియో పై ఢిల్లీ పోలీసులు స్పందించలేదు.. 'ఘర్ కా కాలేష్' అనే ట్విట్టర్ లో ఈ వీడియో షేర్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)