గరిష్ట స్థాయికి చేరిన సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌ షేరు

Telugu Lo Computer
0


టాటా గ్రూప్ భారతదేశంలోని పురాతన కార్పొరేట్ సంస్థలలో ఒకటి. స్థాపించి వందేళ్లు పూర్తి చేసుకున్న అనేక కంపెనీల జాబితాలో ఇదొకటి. చిన్న కంపెనీల షేర్లు కూడా టాటా బ్రాండ్ చెబితే చాలు రాకెట్ కంటే వేగంగా పెరుగుతాయి. టాటా పేరుకున్న క్రేజ్ అలాంటిది. టాటా ఇటీవలే సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌లో పెట్టుబడిని ప్రకటించింది. టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ హెల్త్‌కేర్ ఫండ్ ఈ కంపెనీలో 10.82 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ షేర్లు టాటాకు ప్రిఫరెన్షియల్ అలాట్‌మెంట్ ద్వారా ఇవ్వబడతాయి. ఈ వార్త బయటకు రాగానే సకార్ షేర్లు భారీగా దూసుకెళ్లాయి. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభించిన వెంటనే 20 శాతం ఎగువ సర్క్యూట్‌ను తాకి, ట్రేడింగ్ ముగిసే సమయానికి 20 శాతం లాభంతో రూ.324.65 వద్ద ముగిసింది. ఈ డీల్‌కు ముందు కూడా సాకర్ హెల్త్‌కేర్ స్టాక్ మల్టీబ్యాగర్‌గా ఉంది. ఇది చాలా చిన్న కంపెనీ అయినప్పటికీ, దీని మార్కెట్ క్యాప్ కేవలం రూ.620 కోట్లు. ప్రస్తుతం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ చిన్న కంపెనీ 2004లో స్థాపించబడింది. ప్రస్తుతం 300 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. గత 5 రోజుల్లో ఈ షేరు ధర దాదాపు 26 శాతం బలపడింది. గత 1 నెలలో 27 శాతానికి పైగా, 6 నెలల్లో 40 శాతానికి పైగా, ఏడాదిలో 62 శాతానికి పైగా పెరుగుదల నమోదైంది. మూడేళ్ల క్రితం సాకర్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌ ఒక షేరు ధర కేవలం రూ.55 మాత్రమే.. అది ఇప్పుడు రూ.325కి చేరుకుంది. ఈ చిన్న స్టాక్ కేవలం 3 సంవత్సరాలలో దాదాపు 6 రెట్లు పెరిగింది. అంటే ఒక ఇన్వెస్టర్ 3 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో రూ.17,000 ఇన్వెస్ట్ చేసి దానిని కలిగి ఉంటే.. అతని పెట్టుబడి విలువ ఈ రోజు రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉండేది.

Post a Comment

0Comments

Post a Comment (0)