టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు?

Telugu Lo Computer
0


టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వివరణ కోరారు. 'ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్‌ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్‌ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?'' అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు. ప్రభుత్వం నుంచి తక్షణమే సమాధానం వస్తే బిల్లుపై నిర్ణయం త్వరగా తీసుకునే అవకాశం ఉంటుందని రాజ్ భవన్ వెల్లడించింది. మరోవైపు గవర్నర్‌ కోరిన వివరణలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గవర్నర్‌ లేవనెత్తిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. కాసేపట్లో రాజ్‌భవన్‌కు వివరణ పంపనున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. మరోవైపు ఆర్టీసీ యూనియన్‌ నాయకులను గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు. ఉదయం 11.30 గంటలకు పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నాయకులతో చర్చిస్తానని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)