ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 17 August 2023

ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ !


ప్పటి నుంచి 96 గంటలపాటు అంటే ఆదివారం అర్థరాత్రి వరకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నవారికి కన్వీనియెన్స్ ఫీజు ఉండదని టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా ప్రకటించింది.నాలుగురోజులపాటు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తున్నారు. టికెట్లను వెబ్ సైట్, యాప్ ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ ఆఫర్ పొందడానికి కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ లోపు జరిగే ప్రయాణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్లకు సంబంధించి మాత్రమే తగ్గింపు వర్తిస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు చేసే విమాన ప్రయాణ టికెట్స్ ను ఆదివారంలోగా, ఆగస్ట్ 20వతేదీ లోపు ఎయిర్ ఇండియా వెబ్ సైట్ నుంచి కానీ, మొబైల్ యాప్ నుంచి కానీ బుక్ చేస్తేనే ఈ కన్వీనియెన్స్ ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. లిమిటెడ్ సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన డొమెస్టిక్ మార్గాల్లో ఈ అమ్మకాల ద్వారా బుక్ చేసే టికెట్ ధర ఎకానమీ క్లాస్ లో రూ. 1470 నుంచి ప్రారంభమవుతుంది. బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ. 10,130 నుంచి ప్రారంభమవుతుంది. 

No comments:

Post a Comment