డిజిటల్ రూపీ యాప్ ను అందుబాటులోకి తెచ్చిన కెనరా బ్యాంక్ !

Telugu Lo Computer
0


కెనరా బ్యాంక్ కొత్త సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. దీని వల్ల బ్యాంక్ కస్టమర్లకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ తాజాగా డిజిటల్ రూపీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. కెనరా డిజిటల్ రూపీ పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ యాప్ ద్వారా యూజర్లు మర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేయొచ్చు. అలాగే డిజిటల్ కరెన్సీ ద్వారా పేమెంట్ చేయొచ్చు. దేశంలో బ్యాంక్ ఇలాంటి సర్వీసులు తీసుకురావడం ఇదే ప్రథమం. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకవచ్చిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ పైలెట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కెనరా బ్యాంక్ ఈ డిజిటల్ రూపీ యాప్‌ను తీసుకువచ్చింది. ఇండియన్ రూపీ డిజిటల్ వెర్షన్‌ను సీబీడీసీగా చెప్పుకుంటారు. ఇప్పుడు కెనరా బ్యాంక్ తొలిగా ఈ డిజిటల్ రూపీ యాప్‌ను తెచ్చింది. అంతేకాకుండా మర్చంట్లు వారి యూపీఐ క్యూర్ కోడ్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్‌ను స్వీకరించొచ్చు. డిజిటల్ కరెన్సీకి మళ్లీ విడిగా ఎలాంటి క్యూఆర్ కోడ్స్‌ను ఉపయోగించాల్సిన పని లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)