నవాబ్ మాలిక్‌కు బెయిల్ మంజూరు

Telugu Lo Computer
0


నీలాండరింగ్ కేసులో అరెస్టైన్ మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆరోగ్య నిబంధనల కింద ఈమేరకు రెండు నెలల బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించింది. ఈ ఏడాది జులైలో ముంబై కోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితోకూడిన ధర్మాసనం , కిడ్నీ వ్యాధితోపాటు ఇతర అనారోగ్యాలతో మాలిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గుర్తించి బెయిల్ మంజూరు చేసింది. కేసు తాలూకు మెరిట్స్‌తో కాకుండా కేవలం వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు పేర్కొంది. 2021 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)నేత నవాబ్ మాలిక్‌ను మనీలాండరింగ్ కేసులో 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు అరెస్టు చేసింది. 2021 అక్టోబర్‌లో ముంబై లోని క్రూయిజ్ షిప్‌పై నార్కోటిక్ బ్యూరో మాజీ డైరెక్టర్ సమీర్ వాంఖడే దాడి చేశారు. ఈ దాడిలో నవాబ్ మాలిక్ బంధువు సమీర్‌ఖాన్‌ను డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ కేసులోనే నవాబ్ మాలిక్ అక్రమ లావాదేవీలు జరిపారనే ఆరోపణలతో నిందితుడయ్యారు. అలాగే పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహింతో ఆయన సన్నిహితులతో నవాబ్ మాలిక్‌కు సంబంధాలు ఉన్నాయన్న నేరారోపణలు ఉన్నాయి. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న మాలిక్ ప్రస్తుతం ముంబై లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)