పులిని ఢీకొట్టిన వాహనం - గాయాలపాలై మృతి

Telugu Lo Computer
0


హారాష్ట్ర గొండియా జిల్లాలోని నవేగావ్ – నగ్జీరా కారిడార్‌లో రోడ్డు దాటుతున్న పులిని వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టిన సంగతి తెలిసిందే. దీంతో తీవ్రంగా గాయపడ్డ పులి.. రోడ్డుపైనే ఉండిపోయింది. పులిని చూసిన వాహనదారులు తమ వాహనాలను దానికి కొంచెం దూరంలోనే ఆపేశారు. పులి చేతనై చేతకాక అన్నట్లు అడవిలోకి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలపాలైన ఆ పులి ప్రాణాలు కోల్పోయింది. నవేగావ్ – నగ్జీరా కారిడార్‌లోని ముర్దోలి ఫారెస్టులో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఓ రెండేండ్ల వయసున్న పులి రోడ్డును దాటుతుండగా.. వేగంగా వచ్చిన వాహనం దాన్ని ఢీకొట్టింది. దీంతో పులికి తీవ్ర గాయాలయ్యాయి. లేవలేని పరిస్థితిలో, దీనంగా రోడ్డుపైనే పడిపోయింది పులి. ఆ తర్వాత కాసేపటికి అడవిలోకి వెళ్లిపోయింది. గమనించిన వాహనదారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి డిప్యూటీ కన్జర్వేటర్ ప్రమోద్ పంచ్‌భాయి తమ బృందంతో అక్కడికి చేరుకున్నారు. పులి ఆచూకీ కోసం వెతికారు. ఘటనాస్థలానికి కొంచెం దూరంలో దీనంగా పడిఉన్న పులిని శుక్రవారం ఉదయం 7:30 గంటలకు గుర్తించారు. అనంతరం తీవ్ర గాయాలపాలైన పులిని నాగ్‌పూర్ గోరెవాడలోని వైల్డ్ లైఫ్ రెస్క్యూ సెంటర్‌కు తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం దానికి పోస్టుమార్టం నిర్వహించారు. వన్యప్రాణులు సంచరించే అభయారణ్యాల గుండా వెళ్లే వాహనదారులు కాస్త నెమ్మదిగా ప్రయాణించాలని అటవీశాఖ అధికారులు సూచించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)