బైకును కారులా మార్చాడు !

Telugu Lo Computer
0


వ్యక్తి తన బైకును ఏకంగా కారులా మార్చేశాడు. చూసేందుకు అది ఏ మాత్రం బైకులా అనిపించటం లేదు. అచ్చం కారు లాగానే ఉంది. ఇందుకోసం బైక్‌కు కారు బాడీని అమర్చాడు. బైకు టైర్లు కాకుండా దానికి మరోవైపు మూడో టైరును ఏర్పాటు చేశాడు. అలాగే బైకు పక్కనే మరో ఇద్దరు కూర్చునేందుకు వీలుగా సీట్లు కూడా అమర్చాడు. దీంతో ఆ బైకు రూపు రేఖలు పూర్తిగా మారిపోయింది. వెనుక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా అచ్చం కారులా కనిపిస్తుంది. బైకు కాదు,కారే అన్నట్టుగా..కారుకు ఏమాత్రం తీసిపోని విధంగా మార్చేశాడు. అంతేకాదు కారుకు డిక్కీ ఉన్నట్టుగా వెనుక వైపు లగేజీ పెట్టుకునేందుకు కూడా ప్రత్యేకించి డిజైన్ చేశాడు. ఇంకేం కారు కానీ, కారును.. ప్రజలందరూ వింతగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)