పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 11 August 2023

పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు


నసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం జరిగిన సభలో పవన్‌ కల్యాణ్‌ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు చేశారు. ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు అందించారు. బహిరంగ సభలో పవన్‌ నిబంధనలు ఉల్లంఘించారని.. పవన్‌ అలా వ్యవహరించి ఉండకూడదని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. విశాఖలోని రుషికొండలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. నగరంలోని జోడుగుళ్లపాలెం నుంచి ఎవరినీ అనుమతింబోమని పోలీసులు తేల్చి చెప్పారు. ర్యాడిసన్‌ బ్లూ హోటల్‌ నుంచి కేవలం పవన్‌ వాహనానికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు తెలిపారు. రుషికొండ ఎదురుగా ఉన్న రోడ్డులో మాత్రమే పవన్‌ వెళ్లాలన్నారు. కావాలంటే పవన్‌ కల్యాణ్‌ గీతం యూనివర్సిటీ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పోలీసులు వెల్లడించారు.

No comments:

Post a Comment