అడ్డంకులను ఎలా అధిగమించాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 4 August 2023

అడ్డంకులను ఎలా అధిగమించాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి !


ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా  సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటారు. తనకు నచ్చిన అంశాలను ఎప్పటికప్పుడు పోస్ట్‌ చేస్తూ ఫాలోవర్లలో స్ఫూర్తి నింపుతుంటారు. అలా ట్విటర్‌ వేదికగా ఆయన పంచుకున్న వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఎలాగైనా రోడ్డు దాటాలని ఓ ఏనుగు ప్రయత్నిస్తుంటుంది. అయితే, రోడ్డు దాటడానికి కంచె అడ్డంగా ఉండటంతో దానిని తొలగించేందుకు ఆ ఏనుగు ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఒకేసారి కంచెను నెట్టకుండా ఎంతో చాకచక్యంగా కాలితో తాకి దాన్ని, ఎటువంటి ప్రమాదం లేదని నిర్ణయించుకొన్న తర్వాతే కాలితో స్తంభాన్ని నెడుతూ ఆ వీడియో కనిపించింది. 45 సెకన్లు ఉన్న ఈ వీడియోను ట్విటర్‌ వేదికగా మహీంద్రా పంచుకున్నారు. 'అడ్డంకులను ఎలా అధిగమించాలో ఈ ఏనుగును చూసి నేర్చుకోండి. మనకు ఎదురయ్యే సవాలు ఎంత శక్తిమంతమైనదో జాగ్రత్తగా పరిశీలించాలి. దాని శక్తి తెలుసుకున్నప్పుడే ఆ సవాలును ఎలా సమర్థంగా ఎదుర్కోవాలో అర్థమవుతుంది. అప్పుడే విజయం సొంతమవుతుంది. విజయం సాధించాక అచ్చం ఆ ఏనుగు లాగే గర్వంగా నడవండి ' అని వీడియో కింద మాటలు జోడించారు. ఈ వీడియో షేర్ చేసిన ఆరు గంటల్లోనే మూడు లక్షల మంది వీక్షించారు. దీనిపై స్పందిస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. 'కంచెలో విద్యుత్‌ ఉందేమోనని మొదట ఏనుగు పరీక్షించింది. ఆ తర్వాతే అది స్తంభాన్ని నెట్టింది' అని చాలామంది నెటిజన్లు ఏనుగు చాకచక్యాన్ని పొగిడారు. 'మీరు ప్రతి విషయాన్ని చక్కగా విశ్లేషిస్తారు. అందుకే మీకు చాలా మంది అభిమానులుగా మారుతారు' అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 'కేవలం ఆనంద్‌ మహీంద్రా లాంటి దిగ్గజాలు మాత్రమే ప్రతి అంశం నుంచి పాఠం నేర్చుకుంటారు' అంటూ మరో వ్యక్తి కామెంట్‌ చేశాడు. 

No comments:

Post a Comment