వెల్‌కమ్ తులసీ భాయ్‌ ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 August 2023

వెల్‌కమ్ తులసీ భాయ్‌ !


ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఆయన గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో రెండురోజుల పాటు జరిగే సంప్రదాయ వైద్య అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. 'గుడ్‌ ఫ్రెండ్‌ తులసీ భాయ్' అంటూ ప్రధాని మోడీ ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను షేర్ చేశారు. జీ20 దేశాల ఆరోగ్య మంత్రుల స్థాయి సమావేశంలో భాగంగా ఈ సదస్సు జరుగుతుంది. దీనిలో పాల్గొనేందుకు వచ్చిన టెడ్రోస్‌ అక్కడ కొందరు ప్రతినిధులతో కలిసి దాండియా ఆడారు. దానికి సంబంధించిన వీడియోను మోడీ షేర్ చేస్తూ.. 'గుడ్‌ ఫ్రెండ్ తులసీ భాయ్‌.. నవరాత్రికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది'అని రాసుకొచ్చారు. టెడ్రోస్‌కు మోడీనే తులసీ భాయ్‌ అని పేరు పెట్టారు. గత ఏడాది భారత్‌ పర్యటనకు వచ్చిన ఆయన  ఆరోగ్య సంస్థకు చెందిన సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన గుజరాతీలో మాట్లాడి ఆశ్చర్యపర్చారు. అప్పుడు అక్కడే ఉన్న మోడీ మాట్లాడుతూ..'తనకు ఒక గుజరాతీ పేరు పెట్టమని టెడ్రోస్‌ నన్ను అడిగారు. ఒక గుజరాతీగా నా బెస్ట్‌ ఫ్రెండ్‌కు తులసీ భాయ్‌ పేరును సూచిస్తున్నాను' అని ఆ సందర్భంలో చెప్పారు. దానిని ఉద్దేశించే ఇప్పుడు కూడా టెడ్రోస్‌ను ఆ పేరుతో పిలిచారు.

No comments:

Post a Comment