బీసీసీఐ వేల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లింపు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 August 2023

బీసీసీఐ వేల కోట్ల రూపాయల ఆదాయపు పన్ను చెల్లింపు !


బీసీసీఐ వివిధ రూపాల్లో ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. వన్డే, టీ20, టెస్టు క్రికెట్‌ హక్కులను విక్రయించడం ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా ఐపీఎల్‌కు సంబంధించిన హక్కుల విషయంలో అయితే ఇక చెప్పనవసరం లేదు. వివిధ టోర్నమెంట్స్ ఉన్న సమయంలో టీవీ, డిజిటల్‌ రైట్స్‌ రూపంలోనూ భారీగానే సంపాదిస్తోంది. ఇన్ని రకాలుగా ఆదాయం సంపాదిస్తున్న బీసీసీఐ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో పన్ను చెల్లిస్తుంది. బీసీసీఐ ఏటా ఆదాయపు పన్ను రూపంలో ఎంతెంత చెల్లిస్తోందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ వేదికగా వెల్లడించింది. ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఐదేళ్లకు సంబంధించిన బీసీసీఐ ఆదాయం, ఖర్చులతో పాటు పన్నుల వివరాలను తన సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధురి వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో రూ.1159 కోట్లను ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లించిందని మంత్రి తెలిపారు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే 37 శాతం అధికమని పేర్కొన్నారు. 2020-21లో బీసీసీఐ రూ. 7,606 కోట్లు ఆదాయం సంపాదించగా.. రూ.3064 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. అంతకుముందు ఆయా సంవత్సరాల్లో ఎంతెంత పన్ను చెల్లించిందో వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్లు చెల్లించగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్లు పన్నుగా చెల్లించగా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.882.29 కోట్లు చెల్లించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్లు చెల్లించగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,159 కోట్లను పన్ను రూపంలో చెల్లించినట్టు కేంద్ర మంత్రి సభకు తెలిపారు. 

No comments:

Post a Comment