కుప్పింటాకు - ఆరోగ్య ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


ల్లెటూళ్లలో, పట్టణాల్లోనూ కుప్పింటాకు మొక్కలు కనిపిస్తుంటాయి. కానీ పిచ్చి మొక్కగా భావించి పీకిపారేస్తుంటాం. ఇప్పుడీ మొక్కనే గురక, చెవుడుతో పాటు గజ్జి, తామర వంటి చర్మవ్యాధులను తగ్గించేందుకు వాడుతున్నారు. కుప్పింటాకుకు సున్నం కలిపి మెత్తగా నూరి.. ఆ లేపనాన్ని దురద, దద్దుర్లు, గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు ఉన్నచోట రాయాలి. ఇలా 4-5 రోజుల పాటు రాయడం వల్ల చర్మవ్యాధులు పూర్తిగా నయమవుతాయి. గురక, చెవుడు సమస్యలున్నవారు కుప్పింటాకు తైలాన్ని వాడితే ఉపశమనం ఉంటుంది. ఒక గుప్పెడు కుప్పింటాకులను తీసుకుని.. అందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా మిరియాలను కలిపి మెత్తగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని 100 గ్రాముల నువ్వుల నూనెలో వేసి కాయాలి. రసాన్ని పూర్తిగా పీల్చుకునేంతవరకూ మరగనిచ్చి.. ఆ నూనెను వడగట్టి నిల్వచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను రోజూ 2-3 చుక్కల మోతాదులో చెవుడు ఉన్న చెవిలో వారం రోజులపాటు వేసుకుంటే.. వినికిడి సమస్య తగ్గుతుంది. రాత్రి పడుకునే ముందు ముక్కులో వేసుకుని పడుకుంటే.. గురక సమస్య కూడా క్రమంగా తగ్గుతుంది. కీళ్ల నొప్పులున్నవారు కూడా ఈ నూనెతో నొప్పి ఉన్న ప్రాంతంలో మర్దనా చేసుకుంటే.. తగ్గుతుంది. నరాలు చచ్చుబడి పక్షవాతంతో ఉన్నవారికి కుప్పింటాకు అద్భుతంగా పనిచేస్తుంది. కుప్పింటాకు మొక్క వేర్ల బెరడు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను మాత్రలుగా చేసుకుని రోజుకి రెండుపూటలా మింగాలి. ఇలా క్రమంగా ఈ మాత్రలు తీసుకోవడం ద్వారా చచ్చుబడిన నరాల్లో కదలికలు వచ్చి.. పక్షవాతం సమస్య తగ్గి.. మళ్లీ మామూలు స్థితికి వస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)