మన భూభాగం చాలా సురక్షితంగా ఉంది ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 August 2023

మన భూభాగం చాలా సురక్షితంగా ఉంది !


స్వార్థపరులు, తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యుల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, మన భూభాగం చాలా సురక్షితంగా ఉందని, మన సాయుధబలగాలకు సరిహద్దులను రక్షించగల సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిప్పికొట్టారని, ఇప్పుడు సరిహద్దుల్లో రోడ్లు, కీలకమైన మౌళిక సదుపాయాలు నిర్మించబడ్డాయని ఆయన అన్నారు. లడఖ్‌లో భారత్‌కు చెందిన భూమిని చైనా ఇప్పటికే ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చెప్పడంపై బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందు ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ లడఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని అబద్ధం చెప్పారని, చైనా ఆక్రమిస్తోందని లడఖ్ మొత్తానికి తెలుసు అని, దీనిపై ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. 

No comments:

Post a Comment