ఢిల్లీ మెట్రోలో మహిళల మాటల యుద్ధం !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న వీడియో వైరల్ అవుతోంది. suyash_creates అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో ఇద్దరు మహిళలు తీవ్రమైన పదజాలంతో ఒకరినొకరు ధూషించుకున్నారు. గొడవ ఎందుకు మొదలైందో స్పష్టంగా తెలియనప్పటికీ తీవ్రమైన గొడవ జరిగింది. ఒక దశలో వారిలో ఒక మహిళ చెప్పుతో కొడతానంటూ ఫైర్ అయ్యింది. ఈ వీడియోను 'Delhi metro stuff part-2' అనే ట్యాగ్‌తో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్ లైన్‌లో చర్చకు దారి తీసింది. ఢిల్లీ మెట్రో ఇలాంటి గొడవలకు కేంద్రంగా మారిపోయిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. 'ఈ రోజుల్లో మెట్రోలో ఏం జరుగుతోంది?' అని,, మహిళల్లో ఒకరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 'ఈ మహిళకు తక్షణ వైద్యం సహాయం చేయాలి' అంటూ కామెంట్లు పెట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)