లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేసిన ఖలిస్తాన్ మద్దతుదారులు !

Telugu Lo Computer
0


కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియా లోని సర్రేలో అతి పురాతన లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జూన్ 18న గురుద్వారా సమీపంలో జరిగిన ఇద్దరు వ్యక్తుల హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తున్నదంటూ ఉన్న పోస్టర్లను ఆలయం దర్వాజాకు అంటించి పారిపోయారు. అందులో గురునానక్ సిఖ్ గురుద్వారా సాహిబ్ సర్రే చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫోటో కూడా ఉంది. కెనడాలో ఈ ఏడాది ఇప్పటివరకు మూడు ఆలయాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఏడాది జనవరి 31న బ్రాంప్టన్ లోని హిందూ ఆలయాన్ని భారత వ్యతిరేకులు ధ్వంసం చేశారు. అదే విధంగా గత ఏప్రిల్‌లో ఒంటారియోలో మరో దేవాలయాన్ని కూల్చివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)