ఉల్లి ధరకు రెక్కలు ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 August 2023

ఉల్లి ధరకు రెక్కలు !


దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు టమాటా ధర ఆకాశాన్నంటాయి. టమాటా ధరతో సామాన్యులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని రోజుల పాటు చాలా మంది ఇళ్లలో టమాటా అనే మాట లేకుండా పోయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తరపున తక్కువ ధరల్లో టమాటా ధరలను విక్రయించింది. ప్రస్తుతం టమాటా ధర అదుపులో ఉంది. పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఇక టమాటాా తర్వాత ఇప్పుడు ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. అయితే ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ, ద్రవ్యోల్బణం తగ్గడానికి బదులు పెరుగుతోంది. ముఖ్యంగా ఉల్లి ధర పెరుగుతుండడం అటు సామాన్య ప్రజలతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా టెన్షన్‌గా మారింది. నెల రోజుల క్రితం వరకు కిలో రూ.15 నుంచి 20 వరకు లభించే ఉల్లి ఇప్పుడు రూ.35 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు. కాగా, దేశంలోని అనేక నగరాల్లో దీని ధర కిలో రూ.60 దాటింది. దీని వల్ల సామాన్య ప్రజల బడ్జెట్ దిగజారింది.

No comments:

Post a Comment