చాలా ఆనందంగా ఉంది !

Telugu Lo Computer
0


చంద్రయాన్‌ 3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె. శివన్‌ హర్షం వ్యక్తంచేశారు. ఇంత అద్భుతమైన విజయం సాధించిన ఇస్రోను అభినందించారు. ఈ చారిత్రక విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఈ క్షణం కోసం ఎంతోకాలంగా ఎదురు చూసినట్టు చెప్పారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ''ఇదో గ్రాండ్‌ సక్సెస్‌. ఈ విజయం కోసం గత నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నాం. చాలా స్వీట్‌ న్యూస్‌. దేశమంతా ఎదురుచూస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు విజయవంతమైంది. చాలా ఆనందంగా ఉంది. అద్భుత విజయం సాధించిన ఈ క్షణాన దేశ ప్రజలందరికీ అభినందనలు. ప్రభుత్వం కూడా సహకరించింది. చంద్రయాన్‌ 3 పంపించే సైన్స్‌ డేటా ఒక్క భారత్‌ కోసమే కాదు.. యావత్‌ ప్రపంచ సైంటిస్టులందరి కోసం. ఈ డేటాను ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు వినియోగించి కొత్త విషయాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో ప్రపంచ ప్రయోజనాలు ఉన్నాయి'' అన్నారు. 2019లో చంద్రయాన్‌-2 ల్యాండర్‌ విజయానికి అడుగు దూరంలో కుప్పకూలడంపై అప్పటి ఇస్రో చీఫ్‌గా ఉన్న శివన్‌ కన్నీళ్లు పెట్టుకోవడాన్ని యావత్‌ దేశం దిగ్భ్రాంతితో వీక్షించిన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను ఓదార్చారు. మరోసారి ప్రయత్నిద్దామని భరోసా ఇవ్వగా.. తాజాగా ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సారథ్యంలో ఆ ప్రయోగం గ్రాండ్‌ సక్సెస్‌ సాధించడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)